
నమ్మకు ఇలలో ఎవరిని
నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని (2) నమ్ముకో రక్షకుడేసుని (2) కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2) శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2) దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2) రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||


Follow Us