
నమ్మదగిన వాడవు
నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య } 2 చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును } 2|| నమ్మదగిన || నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే శత్రువుల కోటలన్ని కూలిపోయెను సంకేళ్ళు సంబరాలు ముగబోయెను } 2 నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను } 2|| నమ్మదగిన || నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి జఠిలమైన త్రోవలన్ని దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి } 2 ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను } 2|| నమ్మదగిన || నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి } 2 ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము } 2|| నమ్మదగిన ||


Follow Us