LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా అర్పణలు నీవు


నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద } 2
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని } 2

ఆధారణలేని ఈ లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే } 2
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే  మేలాయెనే } 2|| నా అర్పణలు ||

గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే } 2
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే } 2|| నా అర్పణలు ||

మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే } 2
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను } 2|| నా అర్పణలు ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words