LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా గీతారాధనలో


నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2)        ||నా గీతా||

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2)        ||నా గీతా||

చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2)        ||నా గీతా||

ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2)        ||నా గీతా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words