
నా జీవిత భాగస్వామివి నీవు
నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2 నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2 నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2 నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2|| నా జీవిత || నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2 నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి నీ విందుశాలకు నను చేర్చితివి } 2|| నా జీవిత || నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2 నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నను చేర్చుదువు


Follow Us