
నా జీవితాన కురిసెనే
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను


Follow Us