
నా పితరుల దేవుడే నా దేవుడు
నా పితరుల దేవుడే నా దేవుడు నా దేవుడు నా దేవుడు..... నా దేవుడే నా యేసయ్యా. 1.విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు హనోకు దేవుడే నా దేవుడు నే నడిచెద నే నడిచెద - హనోకు దేవునితో నడిచిన రీతిగా Iనా హనోకు దేవునితో నడిచిన రీతిగా //నా// 2.అబ్రహాము దేవుడే నా దేవుడు - విశ్వాసమునకు తండ్రిగా అతడే నిలిచెను నే నిలిచెద నే నిలిచెద - అబ్రహాము విశ్వాసముతో నిలిచిన రీతిగా //నా// 3.ఇస్సాకు దేవుడే నా దేవుడునూరంతల ఫలము అతడే పొందెను నే పొందెద నే పొందెద నూరంతల ఫలమును నే పొందెదనా //నా// 4.ఇశ్రాయేలు దేవుడు నా దేవుడు - ఒక రాత్రంతా పోరాడి దీవెన పొందెను పోరాడెద పోరాడెద-ఇశ్రాయేలులానే పోరాడెద //నా//


Follow Us