
నా ప్రియ యేసు రాజా
నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు శోధనలో వేధనలో నిను వీడి పోనీయకు 1. కలుషితమగు ఈ లోకం – కదిలెను నా కన్నులలో మరణ శరీరపు మరులే – మెదలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా|| 2. మరిచితినే నీ వాగ్ధానం – సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు సుడులే వడిగను పెనుగొనగ కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా|| 3. నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది తీరని పోరాటములో దూరముగ పరుగిడితిని కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా|| 4. జాలిగ నిన్ను విడచితిని కోరితి దీవెనలెన్నో భావనలే నేనరసి వదిలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||


Follow Us