
నా బ్రతుకు దినములు
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||


Follow Us