
నా మట్టుకైతే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము గుంపులు నన్ను చంపును యనుచు కేకలు వేసి పొర్లిననూ సౌలుగా నుండా మరి పౌలుగ మార్చబడన్ - దేవుని దర్శనమొందితిని చెరసాలలో మము బంధించినను - కొరడా దెబ్బలు కొట్టినను గానము చేయ - మరి ప్రార్ధనచేయ - బంధకములు ఊడిన యపుడు ఉపవాసములలో జాగరణములలో - అరణ్యమున ఆపదలలో చాలా మారులు - మరి నిందలు వెలివేసి హింసపరచినను వెనుకటి వాటినన్నియు మరచి ముందున్న వాటిని తలచి వేగిరపడుచు మరి ఓర్పుతో జనుచు - గురియొద్దకు నే చేరెదను కరువై నను సరే - ఖడ్గంబుమరి - వస్త్రహీనతయైనను - ఉన్నవియైనా రానున్నవియైన - ప్రభుప్రేమను యెడబాపవు


Follow Us