
నా యేసయ్యా నా స్తుతియాగము
నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు (2) ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా (2) విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు బలము చూపించినావు (2) మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా (2) మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నియు తప్పించెదవు (2) నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు (2) రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా||


Follow Us