
నా యేసు రాజ్యము
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును (2) సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2) ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు|| హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2) ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||


Follow Us