
నా వేదనలో నా బాధలో
నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే నాకది ఎంతో మేలని (2) నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను (2) నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||


Follow Us