
నా స్తుతి పాత్రుడా
నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! ॥ నా స్తుతి పాత్రుడా ॥ నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2 నీ వాక్యమే నా పాదములకు దీపము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥ నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2 నీ కృపయే నా జీవన ఆధారము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥ నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥


Follow Us