
నా స్వాస్థ్యమైన పరలోకము
నా స్వాస్థ్యమైన పరలోకము ఎపుడు చేరెదనో సౌంధర్య సీయోనులో నా ప్రభువైన యేసయ్యను రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదనో మహోన్నతుడా - తేజోనివాసి మహిమనంత విడిచి నా కోసమే దిగి వచ్చిన ప్రేమ సాగరా నా కోసమే పోరాడి చెరనుండి విడిపించినావా మహాఘనుడా మహిమా స్వరూపి - స్తుతి మహిమలు నీకే నా కాలు జారే చోటునుండి - నీ తేజో మహిమ నిలిచే సంఘములో నన్ను నిలిపిన నా మహిమైశ్వర్యమా మహనీయుడా మహానందమే కడవరి పిలుపులో ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మనె ఆ పిలుపు కోసం నే వేచి యుండెదను - నీ కృప తోడుండగా


Follow Us