
నా హృదయములో
నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు (2) కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరింప తరమా నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి (2) విచారములు కొట్టి వేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి (2) అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను|| పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు (2) పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||


Follow Us