LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా హృదయాన కొలువైన


నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే
నీ  సన్నిధిలో పూజార్హుడా } 2
నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

అగ్ని ఏడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను } 2
అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే } 2
నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా } 2
నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే } 2
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను } 2
నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును } 2
నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా } 2
సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే } 2
నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
నా స్వరము నీకే అర్పింతును } 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే } 2
నీ  సన్నిధిలో పూజార్హుడా
నా హృదయాన కొలువైన - యేసయ్యా  ......

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words