
నాకెన్నో మేలులు చేసితివే
నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో – నను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో – నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా|| నీ రాజ్యమందు నను చేర్చుకొందువు రానున్న రారాజువు – నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||


Follow Us