
నాతో నీవు మాటాడినచో
నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభు (2) నా ప్రియుడా నా హితుడా నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2) బుద్ధి మీరినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2) గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి దిక్కు లేక నేను దయను కోరుచుంటి ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| SHARE THIS:


Follow Us