
నారాగమునీవే - నాగానమునీవే
నా రాగము నీవే - నా గానము నీవే నా పాటకు పల్లవి నీవేకదా యేసయ్యా నా ప్రతి పదములో నీ నామమును గూర్చి స్తుతి గానమే పాడనా నీకోసమే పాడనా యేసయ్యా నీకోసమే పాడనా మాటలు రాని ఆకాశపక్షులకు సరిగమలు నేర్పినది నీవేకదా శృతి చేసితివి నా జీవితమును పూర్ణ మనస్సుతో ఆరాధించుటకు జీవింతునయ్యా నీ సాక్షిగా ఇలలో నీ కృప తోడుండగా నామది నిండిన రక్షణ ఆనందమే అది అణువు అణువు నీ ప్రేమ నే పాడెనే తంబుర సితార నాదముతో నీకృపను గానము చేసెద సంతోష భరితుడనై నా స్తోత్ర గీతమ ఆరాధ్యదైవమా నా విజయ సంకేతమా ఎందరు ఉన్న ఒంటరివాడనని నా జంటగా నీవు నిలిచావయ్యా ఎవరు విడదీయ్య లేనంతగా నన్ను నీ ప్రాణముతో పెనవేసుకుంటివి నీ సిలువ దర్శనం అది మరపురానిది నిత్యము ధ్యానించెదా


Follow Us