LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిజమైన ద్రాక్షావల్లి నీవే


నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2)         ||నిజమైన||

అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)         ||నిజమైన||

నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)         ||నిజమైన||

షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)         ||నిజమైన||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words