LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిండు మనసుతో నిన్నే


నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం
మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట } 2

నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు }2
అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య } 2|| నిండు మనసుతో ||

నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి } 2
నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య } 2|| నిండు మనసుతో ||

సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా
వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా } 2
నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య } 2|| నిండు మనసుతో ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words