LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిన్న నేడు నిరంతరం


నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ||2||
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు ||2||

యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై ||2||
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప ||2||
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న||

యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవముకై ||2||
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించేనే కృప ||2||
మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న||

యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై ||2||
ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప ||2||
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words