LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిన్ను కాపాడువాడు


నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2)         ||నిన్ను కాపాడు||

పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2)         ||నిన్ను కాపాడు||

మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2)         ||నిన్ను కాపాడు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words