LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిన్ను తలచి


నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)     ||నిను తలచి||

జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)     ||నిను తలచి||

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని (2)
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words