
నిన్ను పోలి ఎవరూ లేరు
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే - నా నీడా నీవే ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే


Follow Us