
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు రండయ్యో రండి రండి దావీదు పురముకు రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము పశువుల పాకలో ఒదిగేను శిశువుగా అవతరించే నేడు లోక రక్షకునిగా దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ లోకాల కారకుడు లోకమున పుట్టెను మనిషి మరణము ఆయువు తీరెను


Follow Us