
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||


Follow Us