
నిబంధనా జనులం
నిబంధనా జనులం నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనల జనులం యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం (2) మోషే బడిలో బాలురము (2) యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం (2) వాక్యమే మా ఆహారం (2) ప్రార్ధనే వ్యాయామం – అనుదినము మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం (2) పునరుత్తానుని పత్రికలం (2) పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం (2) క్షమించుటే ఇల మా న్యాయం (2) భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి (2) పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2) ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| ఎవరీ యేసుని అడిగేవో ఎవరోలే యని వెళ్ళేవో (2) యేసే మార్గం యేసే జీవం (2) యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం నిబంధనా జనులం ||యేసు రాజు||


Follow Us