
నిర్మించుకున్నావు యేసు
నిర్మించుకున్నావు యేసు - నా దేహము నీ కోసమే నాకు జీవమిచ్చావు యేసు - నా జీవితము నీ కోసమే నాగానము నీ కోసమే - నా ప్రాణము నీ కోసమే వెదకి చేరావు నీవు - పడియున్న నా చోటికి - దాహమిచ్చావు నీవు - తడి ఆరిన నా నోటికి - నీ జీవజలముల తావులలోన - నా సేదనే తీర్చినావు సజీవ యాగముగాను - నా దేహమును కోరినావు - నీ కీర్తి చాటగ నన్ను నీ సాదనము చేసినావు - నా స్తోత్రగీతికి ఆధారం నీవే - నీ స్తుతికి పాత్రుడ నీవే సాతాను శోధనలు - పోరాటములు సల్పినా - ఈ లోక స్నేహములు నీ నుండి లాగిననూ - నీ ప్రేమ పూరిత గాయాలలోన నాకాశ్రయమిచ్చినావు


Follow Us