
నీ కృప నాకు చాలయ్యా
నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా నీ కృపలను తలపోయుచు జీవించెదనయ్యా కష్టాలలోనైనా కలిమిలోనైన శోధనలోనైన సౌఖ్యములోనైన యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా వేలకొలది వెండి బంగారు నాణెములకంటే నీ వాక్యమే నాకు విలువైనది - విస్తారమైన సిరిసంపదలకంటే నీ సేవయే నాకు ఘనమైనది ఆత్మల భారంతో ఆత్మాభిషేకముతో అంతము వరకు నీ సేవలో సాగెదన్ నీ సంఘక్షేమమే నా ప్రాణము - అది నాకు ఇల ఎంతో భాగ్యము నీ సేవ కొరకే ఈ జీవితం - కరువైన బరువైన నీ కంకితం లెక్కను అప్పగించే ఆ శుభ తరుణములో నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపే చాలు


Follow Us