
నీ కృప బాహుళ్యమే నను రక్షించి
నీ కృప బాహుళ్యమే నను రక్షించి - ఉన్నత పిలుపుతో నను పిలిచింది నీ నామమునకు కీర్తి కలుగుటకు మహిమ గలిగిన సంఘములో నిలిచి ఆరాధించెద స్తుతి అర్పణలతో - ఆరాధించెద స్తుతి గానాలతో శాశ్వత ప్రేమతో ప్రేమించువారికి సమృద్ధికరమైన కృపనిచ్చితివె లోకాన్ని ప్రేమించి శపించబడకుండ వాత్సల్యము చూపి నను రక్షించితివి నిత్యానందముతో నను నింపిన దేవ నీకృప నాకు చాలునయా శాశ్వత జీవముతో నను నింపుటకు నీ ప్రాణము పెట్టి నను బ్రతికించితివి కృతజ్ఞుడనైనేనిను సేవించుచు నా నిత్యజీవమా నిను వెంబడించెద నా దు:ఖదినములు కనుమరుగైపోయే నీ కృప నాకు చాలునయా శాశ్వతమైన నివాసములేని గూడు చెదరిన గువ్వనైయుండగా వేటగాని ఉరినుండి నను రక్షించి నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చితివి నీ బండ సందులలో నే దాగియుండెద నీకృప నాకు చాలునయా


Follow Us