
నీ కృపను గూర్చి నే పాడెదా
నీ కృపను గూర్చి నే పాడెదానీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||


Follow Us