
నీ చల్లని నీడలో
నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో (2) నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని|| కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా (2) నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని|| ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి (2) పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||


Follow Us