LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ దయలో నేనున్న ఇంత కాలం


నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా…          ||నీ దయలో||

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని           ||నీ దయలో||

నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని           ||నీ దయలో||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words