
నీ దీర్ఘశాంతమే - నా హృదయానికి ధైర్యము
నీ దీర్ఘశాంతమే - నా హృదయానికి ధైర్యము నీ కరుణా కటాక్షములే - నా బ్రతుకుకు ఆధారము యేసయ్యా తనిపించరే నీలాగ ప్రేమించే వారెవ్వరూ కడుపేద స్థితిలోనా - కరువేనా బంధువాయెనూ వయసాచ్చినతరుణములో - వస్త్రహీనతే కృంగదీసెను ఏ ఆధారము కనిపించని - నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడ - నన్నాదుకున్నావు యేసయ్యా కనిపించరే నీలాగ దీవించే వారెవ్వరూ ఈ లోక జ్ఞానులలో - వెర్రివానిగా ఉంటిని ఎన్నికైన వారిలో - వ్యర్థునిగా మిగిలిఉంటిని త్యణీకరింపబడినా - నా బ్రతుకునూ కరుణా సంపన్నుడవై - ఆదుకున్నావు యేసయ్యా కనిపించరే నీలాగ క్యప చూపే వారెవ్వరూ నా ప్రాణమునాలో - కృంగియున్న సమయములో జీవముగల నీ కొరకై - నా ప్రాణము పరితపించెను మధురమైన నీ - సహవాసముతో నా జీవనాధుడా - నీ మమతను పంచావు యేసయ్యా కనిపించరే నీలాంటి జీవముగల దేవుడెవ్వరు


Follow Us