LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ పాదం మ్రొక్కెదన్


నీ పాదం మ్రొక్కెదన్ - నిత్యము స్తుతించి
నిన్నుపాడి కీర్తించెదను - యేసయ్య నీ ప్రేమ పొంగుచున్నది.

పరిశుద్ధమైన పరవశమే - పరమ యేసుని కృపావరమే
వెదకి నన్ను కనుగొంటివి - పాడుటకు పాట నిచ్చితివి

నూతన నూనె ప్రభావముతో - నూతన కవిత్వము కృపతోను
నింపి నిత్యము నడిపితివి - నూతన షాలేము చేర్చెదవు

ఇరుకునందు పిలచితివి - నాకు సహాయము చేసితివి
చెడి యెక్కడ తిరుగకుండ - చేరవచ్చి నన్ను ఆదుకొంటివి

నిత్యముగా నీ సన్నిధి - నాకు యిచ్చును విశ్రాంతిని
దుడ్డుకర్ర నీ దండమును - నిజముగ నన్ను ఆదరించును

ఫలించు చెట్టు నీవు నిలచు - తీగగ నేను వ్యాపించుటకై
కొమ్మ నరికి కలుపు తీసి - కాపాడి శుద్ధీకరించితివి

నా హృదయ దైవం నీవు - నాదు రక్షక నా ప్రాణమా
ప్రేమించెదన్ యేసునాధా - ప్రేమ ముఖమున్ దర్శించెదన్

పరిశుద్ధమైన కీర్తితోను - ప్రకాశమైన శిఖరముపై
శీఘ్రముగ చేర్చెదవు - సీయోనులో నిన్ను కీర్తించెదన్

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words