LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ ప్రేమ నాలో మధురమైనది


నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే        ||నీ ప్రేమ||

చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
కాదనలేదే నా మనవులు నీవు (2)
హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బాహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2)
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words