
నీ ప్రేమ మరువలేను
నీ ప్రేమ మరువలేను - నీ కృపను విడిచిపోలేను హత్తుకొంటివే జారిపోకుండ నిలుపుకొంటివే నీ సన్నిధిలో కనుమరుగైపోయిరే నా అన్నవారందరు ఆత్మీయులే చూచుచు దూరముగా నిలిచి నా యేసయ్యా.. నీ ఒక్కడివే నను విడిచిపోలేదుగా యెడబాయని నీ కృపా - మారని నీ ప్రేమా నా ఆస్తిఅంతస్తులు తరగని సంపదలు నా యేసయ్యా... నీ మహిమైశ్వర్యం నా స్థితినే మార్చెనే హోరు గాలిలో గమ్యమే తెలియక సాగిపోలేక అడుగులు తడబడగా నా యేసయ్యా.. ఆ సమయములో బలపరచె నీ మాటలు


Follow Us