
అడగక మునుపే
అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే హల్లెలూయ - ఉపకరములెన్నో చేసితివే నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే నిత్యజీవము నే పొందుటకు - పునరుత్థానము నొందితివే హల్లెలూయ - పునరుత్థానము నొందితివే నాకు ఐశ్వర్యము నిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే


Follow Us