LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ మాట నా పాటగా


నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ

నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించనీ
ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించనీ

ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించనీ
వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ

నీ దివ్య గానామృతం జలధారలుగ పొంగనీ
తాకేటి ప్రతివారిని ఫలవంతముగ మార్చనీ
శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించనీ

ఆత్మీయ గీతాలతో తనువంత పులకించనీ
సంగీతమే బోధయై కనువిప్పు కలిగించనీ
కాలక్షేపంకోసమే పరిమితము కాకుండగ
హృదయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించనీ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words