
నీ ముఖము మనోహరము
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన } 2 నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై } 2 అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై } 2|| యేసయ్య || నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై } 2 అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు } 2|| యేసయ్య || నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై } 2 అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో } 2


Follow Us