
నీ రక్తధారలే ప్రభు
నీ రక్తధారలే ప్రభు - నాకు అమృత ధారలు సిలువలో నాకొరకై - చిందించిన కరుణామృతధారలు ఆహా ఎంత భాగ్యము - ప్రభుయేసు రక్త ప్రభావము జయమిచ్చు జీవధారలు నిరపరాదరక్తము - విమోచన క్రయధనము నీ పాపమెల్ల బాపును - నిత్య జీవ మొసగును సాతాను సంకెళ్ళు తెంపును - స్వస్థ చిత్తులుగా చేయును స్వతంత్ర యోధులుగను చేసి శ్రీ యేసు సాక్షిగా నడుపును యేసు రక్త పానము - ఆశీర్వచన దానము ప్రభుపాత్రలోనిది త్రాగుము - క్షేమాభివృద్ధి పొందుము


Follow Us