LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీటి వాగుల కొరకు


నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు -1
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది -2
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా -1
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా -2
నా ప్రాణమా నా సమస్తమా

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి -2
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి -2
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు                                            ॥ నా ప్రాణమా ॥

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి -2
కంటి పాపగ నీవు నన్ను కాచితివి -2
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను                                        ॥ నా ప్రాణమా ॥

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును -2
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు -2
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును                                               ॥ నా ప్రాణమా ॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words