
నీతో ఒంటరిగా
నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా నీవున్నచోటున లేదే వేదన-నీ కుడిచేతిలో దీవెన లాభమనిపించని చీకటి స్థలమున నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ ఉండాలని నా ఆశయ్యా నీరు కనిపించని ఎడారి దారిన నీ మాటలను ఆలకిస్తూ నీ చేయిపట్టి నడుస్తూ ఉండాలని నా ఆశయ్యా ఆశ ఫలియించని సోలిన క్షణమున నీ నీడలో విశ్రమిస్తూ నీ ఆదరణ అనుభవిస్తూ ఉండాలని నా ఆశయ్యా


Follow Us