LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీతో గడిపే ప్రతి క్షణము


నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words