
నీతో సమమెవరు
నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు - యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు లోక బంగారము ధనధాన్యాదులు - ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నియు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా పరిశద్ద దేవుడెవరున్నారయ్యా-నీవెగా మంచిదేవుడవు పలు వేదాలలో మత గ్రంధాలలో - పాపమే సోకని పరిశుద్ధుడేడి పాపపరిహారార్ధం సిలువమరణమొంది తిరిగిలేచినట్టి దైవనరుడెవ్వరు నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి - నీవేగా విమోచకుడవు నేను వెదకకున్న నాకుదొరికితివి నేను ప్రేమించకున్న నన్ను ప్రేమించితివి నీకుగాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతోసహించి క్షమియించితివి లోకసౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు


Follow Us