
నీపైనే ఆనుకొని
నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతికావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతికార్యం నీ మహిమకై ఫలియించగా కృప చూపిన యేసయ్య వేలగొంతుల్లో మారుమ్రోగేలా - వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా కృపచూపిన యేసయ్యా గుండెలోతుల్లో ఉండిపోయేలా - సంతోషం కలిగించేలా స్వరవేదమే జయనాదంలా విజయాలను కలిగించగా కృపచూపిన యేసయ్యా మారుమూలల్లో విస్తరించేలా - నీ ప్రేమ వివరించేలా సంకీర్తనే నైవేద్యంలా ఘనక్రియలను జరిగించగా కృపచూపిన యేసయ్యా


Follow Us