
నీవు చేసిన మేలులకై
నీవు చేసిన మేలులకై - యేసు నీకేమి చెల్లింతును స్తుతి పాటనే నే పాడుదును - ఎలుగెత్తి నీ క్రియలునే చాటెదన్ యేసయ్య రావయ్య - నా మొట్టా వినవయ్యా ఎవరూ చూపని నీ ప్రేమను - నా పై చూపితి వాశ్చర్యము కరుణించితివి రక్షించితివి - మేలైన మార్గాన్ని చూపితివి నిన్నే ఎరుగని ఓ సమయము - బ్రతుకే వ్యర్ధము అనుకొంటిని పరలోకము ఒకటుందని - నిరీక్షణ ఇచ్చి నడిపితివి భువిలోనున్న మనుజాళికై - బలియై పోతివ యేసుప్రభో నీ రక్తమే నీ శిలువయే - పరలోక రాజ్యానికి మార్గము


Follow Us