
నీవు తప్ప నాకీలోకంలో
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటేలేదయ్యా దావీదు కుమారుడా నను దాటిపోకయ్యా నజరేతువాడా నను విడిచిపోకయా గ్రుడ్డివాడినయ్యా నాకనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరము నియ్యవా కుంటివాడినయ్యా నా తోడు నడవవా లోకమంతా చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసినా ఒంటరినయ్యా నాతోడు నిలువవా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లితండ్రి నీవై నను లాలించవా


Follow Us